Header Banner

స్వచ్చాంధ్ర కార్యక్రమానికి సర్వాంగ సన్నద్ధత.. ఈ-వేస్ట్ సేకరణపై ప్రత్యేక దృష్టి! అధికారులకు స్పష్టమైన ఆదేశాలు!

  Sat Apr 19, 2025 08:26        Politics

స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో ఇవాళ(శనివారం) ఉదయం 6 గంటలకు మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌కు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండటంతో మొత్తం ఈ కార్యక్రమం బాధ్యతలు మంత్రి నారాయణకు అప్పగించారు. నెల్లూరులో లాంఛనంగా మంత్రి నారాయణ ప్రారంభించారు. ముందుగా అల్లీపురంలోని డంపింగ్ కేంద్రాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు.

ఏపీవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.... అన్ని మున్సిపాలిటీల్లో ఈ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు, ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ - వేస్ట్ సేకరణ నిరంతరం జరిగేలా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై ర్యాలీ నిర్వాహణ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈరోజు నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్చంద్ర - స్వచ్ఛ దివస్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా ఉండవద్దని మంత్రి నారాయణ ఆదేశించారు.

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SwachhAndhra #CleanAP #EWasteManagement #MinisterNarayana #GreenInitiative